క‌రోనాకు ముక్కు టీకా.. హైద‌రాబాద్‌లోనే త‌యారీ

-

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయి. శాస్త్ర‌వేత్త‌లు రాత్రింబ‌వ‌ళ్లు క క‌ష్ట‌ప‌డుతున్నారు. వ్యాక్సిన్ త‌యారీలో ప‌లు దేశాలు ముంద‌డుగు వేశాయి. తాజాగా.. క‌రోనా వైర‌స్‌కు విరుగుడుగా ముక్కు టీకా తయారీ కోసం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్ కీల‌క ముంద‌డుగు వేసింది. కొవిడ్‌-19 నివారణకు అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అభివృద్ధిచేస్తున్న ‘నాసల్‌ స్ప్రే వ్యాక్సిన్‌ (ముక్కు ద్వారా ఇచ్చే టీకా)’ను భారత్‌లో తయారుచేసేందుకు భారత్‌ బయోటెక్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు డబ్ల్యూయూతో బుధవారం ఒప్పందం చేసుకుని, ముక్కుద్వారా వేసే టీకా ఉత్పత్తి, పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ వాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి 100 కోట్ల డోసులను చేరుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ్ణ ఎల్లా ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ఈ ముక్కు టీకాను భారీ ఎత్తున ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. కరోనా కట్టడికి భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవ్యాగ్జిన్‌’ మూడోదశ ట్రయల్స్‌ అక్టోబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 25 వేలనుంచి 30 వేల మందిపై మూడోదశ ప్రయోగాలు ప్రారంభించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news