ఆఫ్రికాలో కొత్త వైరస్‌.. ముక్కు నుంచి రక్తస్రావం.. 24 గంటల్లోనే ముగ్గురి మృతి

-

ఆఫ్రికాలో మరో కొత్త వైరస్ ప్రజలను వణికిస్తోంది. బురుండిలోని ఒక చిన్నపట్టణంలో కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందుతోంది.  ఈ వైరస్‌ సోకిన వారి ముక్కు నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగి కొన్ని గంటల్లోనే మరణిస్తున్నారు.  బజిరో ప్రాంతంలో వైరస్‌ సోకి రక్తస్రావం జరిగిన 24 గంటల్లోపే ముగ్గురు చనిపోయారు. దీని బారిన పడిన వారిలో జ్వరం, తలనొప్పి, నీరసం, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ లక్షణాలతో ఆస్పత్తుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దీన్ని నియంత్రించడానికి పట్టణంలోని ప్రజలంతా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ఈ వ్యాధి సోకిన రోగుల్లో కొందరు ఆసుపత్రికి చేరుకోవడానికి కొన్ని గంటల ముందే అధిక రక్తస్రావంతో  క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నట్టు రోగులను పరిక్షించిన ఓ ఆసుపత్రి తెలిపింది. బురుండియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైరస్  బగ్‌గా కనిపిస్తోందని వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో పొరుగ దేశమైన టాంజానియా మార్బర్గ్ వైరస్‌ వ్యాప్తిని ప్రకటించింది. దీంతో ఇతర దేశాలపైకూడా అధిక ప్రభావం చూపుతుందని.. అవి ప్రమాదానికి చేరువలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version