మీరు మంచిగా లాభాలు పొందాలని అనుకుంటున్నారా…? అయితే మీకు LIC నుండి మంచి అవకాశం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. దీని వలన ఇప్పటికే ఎంతో మంది అనేక ప్రయోజనాలని పొందుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
LIC ఎన్నో రకాల పాలసీలని ఇస్తోంది. అయితే ఈ పాలసీల్లో ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ కూడా ఒకటి. దీని వలన చాల రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇక ఈ పాలసీ కోసం పూర్తిగా చూస్తే.. రోజుకు రూ.74 ఆదా చేస్తే రూ.10 లక్షలు పొందొచ్చు. పాలసీ టర్మ్ కాలంలో పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి పాలసీ డబ్బులు లభిస్తాయి.
మీకు 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు టర్మ్ తో పాలసీ పొందొచ్చు. 18 ఏళ్ల వయసు వున్న వాళ్ళు రూ.5 లక్షల బీమా మొత్తానికి 20 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే..
నెలకు రూ.2265 ప్రీమియం కట్టాలి. దీని కోసం రోజుకి కేవలం రూ.75 ఆదా చేస్తే చాలు. ఆ తరువాత మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.10 లక్షలు లభిస్తాయి. అదే విధంగా ఈ పాలసీ డబ్బులు తో పాటుగా రూ.5 లక్షలు కాకుండా బోనస్ కూడా వస్తుంది. బోనస్ రూ.4.5 లక్షల వరకు రావొచ్చు. ఇంకా ఎఫ్ఏబీ కింద దాదాపు రూ.35 వేలు లభిస్తాయి. ఇలా అన్ని చూసుకుంటే రూ.10 లక్షల వరకు పొందవచ్చు.