సాధారణంగా మనం కొత్తగా ఏ స్మార్ట్‌ఫోన్ కొన్నా సరే.. దానికి ఆ ఫోన్ కంపెనీ 1 సంవత్సరం వారంటీ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్లకు ఇచ్చే వారంటీ విషయంలో చాలా కచ్చితమైన రూల్స్‌ను పాటిస్తుంది.
సాధారణంగా మనం కొత్తగా ఏ స్మార్ట్‌ఫోన్ కొన్నా సరే.. దానికి ఆ ఫోన్ కంపెనీ 1 సంవత్సరం వారంటీ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత కూడా వారంటీ కావాలంటే ఫోన్ కొనేటప్పుడే ఎక్స్‌టెండెడ్ వారంటీ లేదా మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫోన్‌కు ఏదైనా డ్యామేజ్ అయినా, సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ లోపం వల్ల ఫోన్ పనిచేయకపోయినా.. వారంటీ కవర్ అవుతుంది. అయితే మిగిలిన స్మార్ట్‌ఫోన్ కంపెనీలేమోగానీ.. సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ మాత్రం తన ఐఫోన్లకు ఇచ్చే వారంటీ విషయంలో చాలా కచ్చితమైన రూల్స్‌ను పాటిస్తుంది. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఐఫోన్లలో బ్యాటరీ సమస్య వస్తే ఆపిల్ దాన్ని వారంటీలో కవర్ చేయదు. అంటే.. ఫోన్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ లేదా ఇతర కాంపొనెంట్ల వల్ల బ్యాటరీ చెడిపోతే తప్ప సాధారణ బ్యాటరీ సమస్య అయితే దానికి ఆపిల్ వారంటీలో కవర్ ఇవ్వదు. ఆ సందర్భంలో వినియోగదారులు కొత్త బ్యాటరీ కొనాల్సిందే.
2. ఐఫోన్లపై స్క్రాచ్‌లు పడినా, ప్లాస్టిక్ భాగాలు పగిలినా వారంటీలో కవర్ కావు.
3. ఆపిల్ అందించే యాక్ససరీలు (హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, కేబుల్స్, చార్జర్స్) తప్ప ఇతర థర్డ్‌పార్టీ యాక్ససరీలు వాడడం వల్ల ఐఫోన్లు చెడిపోతే వాటికి ఆపిల్ వారంటీ కవరేజీ ఉండదు.
4. ఐఫోన్లు నీళ్లలో పడడం వల్ల చెడిపోతే వాటికి వారంటీ ఉండదు.
5. ఆపిల్ ఆథరైజ్డ్ స్టోర్లలో కాకుండా బయట సెల్‌ఫోన్ షాపుల్లో ఐఫోన్లను రిపేర్‌కు ఇస్తే ఆ ఫోన్లకు వారంటీని కోల్పోతారు.
6. ఐఫోన్లలో సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ లోపం కాకుండా ఫోన్ దానంతట అదే స్లోగా పనిచేస్తుంటే.. ఆ ఫోన్లకు కూడా వారంటీని ఇవ్వరు.
7. దొంగతనం చేయబడిన ఐఫోన్లను వాడితే ఆ ఫోన్లకు కూడా వారంటీ ఇవ్వరు.
8. ఐఫోన్లను వారంటీ కింద సర్వీస్‌కు ఇచ్చేటప్పుడు ఆ ఫోన్లు తమవే అని వినియోగదారులు నిరూపించుకోవాలి. అంటే తాము ఫోన్‌ను కొన్నప్పుడు ఇచ్చే బిల్లును కచ్చితంగా చూపించాలన్నమాట. అలాగే ఫోన్ వినియోగదారుడిదే అని నిర్దారించేలా ఆ ఫోన్ పాస్‌కోడ్, ఆపిల్ ఐడీలతో ఐఫోన్‌ను అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయలేకపోతే వారంటీ ఇవ్వరు.