సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఇటీవలే ఐఫోన్లకు గాను ఐఓఎస్ 14 అప్‌డేట్‌ను విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఆ ఓఎస్‌కు అప్‌డేట్ అయిన పలు ఐఫోన్లలో బ్యాటరీ డ్రెయిన్ సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. ఇటీవలే ఐఓఎస్ 14.0.1 అప్‌డేట్‌ను యాపిల్ ఇచ్చినప్పటికీ ఆ సమస్య మాత్రం ఇంకా అలాగే ఉందని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీనిపై యాపిల్ స్పందించింది.
ఐఓఎస్ 14తోపాటు తరువాత వచ్చిన ఐఓఎస్ 14.0.1 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నా.. ఐఫోన్లలో బ్యాటరీ డ్రెయిన్ సమస్య అలాగే ఉంటే సదరు యూజర్లు తమ డేటాను బ్యాకప్ తీసుకుని ఫోన్‌ను ఒకసారి రీసెట్ చేయాలని యాపిల్ చెబుతోంది. అయితే ఈ సమస్యను ఫిక్స్ చేసి త్వరలోనే మరొక అప్‌డేట్‌ను విడుదల చేస్తామని కూడా యాపిల్ వెల్లడించింది.
కనుక ఐఓఎస్ 14 లేదా ఐఓఎస్ 14.0.1 అప్‌డేట్ అయి ఉన్న ఐఫోన్లను వాడుతున్న వారు తమ తమ ఫోన్లలో బ్యాటరీ వేగంగా అయిపోయే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే యాపిల్ చెప్పినట్లుగా చేయడం మంచిది. లేదంటే ఫోన్లు మరింత సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ విషయమై ఇప్పటికే మరొక అప్‌డేట్‌ను రూపొందిస్తున్నామని యాపిల్ తెలిపింది కనుక త్వరలోనే ఆ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో యూజర్లు సమస్య తాత్కాలికంగా పరిష్కారం కావాలనుకుంటే తమ ఫోన్లలో డేటాను బ్యాకప్ తీసుకుని వాటిని రీసెట్ చేయడం మంచిది.