ఐపీఎల్ 2023: జాస్ బట్లర్ కు ఫైన్… తన ఆవేశమే కారణమా !

-

తాజాగా ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ కు షాక్ ఇచ్చాడు. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో రాజస్థాన్ మరియు కోల్కతాల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్కతా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన రాజసాన్ కు ఓపెనర్ జైస్వాల్ అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ రెండవ ఓవర్ లో లేని పరుగు కోసం ప్రయత్నించి… జైస్వాల్ మరియు బట్లర్ ల మధ్య కొద్దిపాటి నిర్లక్ష్యం కారణంగా బట్లర్ రన్ అవుట్ గా వెనుతిరిగాడు. అయితే అనవసరంగా జైస్వాల్ కారణంగానే అవుట్ అయ్యానని భావించిన బట్లర్ పెవిలియన్ కు వెళ్లే క్రమంలో అక్కడున్న బౌండరీ రోప్ ను కాలితో తన్నాడు.

అయితే ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ సీరియస్ గా తీసుకుని బట్లర్ పై మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతను విధించాడు. ఇక సీనియర్ ఆటగాడు ఇలా ప్రవర్తించడం పైన బయట విమర్శలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version