రెండు సూపర్ ఓవర్లకు దారి తీసిన మ్యాచ్‌లో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో సవాల్‌కు రెడీ అయింది. టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది పంజాబ్. మరోవైపు ఈ మ్యాచ్ గెలిస్తే ఢిల్లీకి ఫ్లే ఆఫ్ బెర్తు ఖాయం. వరుసగా రెండు విక్టరీలతో ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవడంతో పాటు కాన్ఫిడెన్స్ పెంచుకున్న రాహుల్ టీంకి ఈ మ్యాచ్ కీలకం.
ముఖ్యంగా మ్యాచ్‌లను ముగించే విషయంలో ఆ జట్టు పక్కాప్లాన్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఈజీగా గెలవాల్సింది. ఆర్‌సీబీతో మ్యాచ్‌ను ఫైనల్ బాల్ వరకూ తీసుకెళ్లిన పంజాబ్.. ఇక ముంబైపై రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. టాపార్డర్ అద్భుతంగా రాణిస్తున్నా మిడిలార్డర్ నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. లోకేశ్, మయాంక్‌తో పాటు లేటుగా అవకాశం వచ్చినా తనదైన స్టైల్‌లో దుమ్మురేపుతున్న గేల్ ఫామ్‌లో ఉండడం కింగ్స్‌కు ప్లస్ పాయింట్. కానీ, మిడిలార్డర్‌లో స్టార్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్ జట్టును దెబ్బతీస్తోంది. అలాగే, షమీ తప్ప డెత్ ఓవర్లలో సత్తా చాటే బౌలర్ లేకపోవడం కూడా సమస్యగా మారింది.
మరోవైపు 9 మ్యాచ్‌ల్లో ఏడు విక్టరీలతో క్యాపిటల్స్ జోరు మీదుంది. లాస్ట్ మ్యాచ్‌లో చెన్నైపై విజయంతో ప్లేఆఫ్‌కు చేరువైన ఆ జట్టు పంజాబ్‌ను ఓడించి బెర్తు కన్ఫామ్ చేసుకోవాలని చూస్తోంది. ఓపెనర్ పృథ్వీ షా ఫామ్ కోల్పోయినా ధావన్ జోరందుకోవడం ప్లస్ పాయింట్. శ్రేయస్, స్టొయినిస్‌లు కూడా సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబడా ఢిల్లీ బౌలింగ్ ఎటాక్‌కు లీడర్. ఈ ఐపీఎల్‌లోనే రబడా టాప్ బౌలర్. తొమ్మిది మ్యాచ్‌ల్లోనే 19 వికెట్లు తీసి బౌలర్ల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.