తెలుగు సినిమా ఇండస్ట్రి నిద్రపోతోందా ?

-

రాజకీయ నాయకులు అని లేదు గౌరవప్రదమైన వ్యక్తులని లేదు ఎవరైనా సోషల్ మీడియాలో దొరికితే వాళ్ల బతుకు ని బూతు బతుకు చేసేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా ఈ విషయాలలో సినిమా వాళ్లనే టార్గెట్ చేస్తూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ విధంగా ఇటీవల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది హాట్ యాంకర్ అనసూయ. దీంతో చేసేదేమీలేక రోజు రోజుకి సోషల్ మీడియాలో తనపై మరియు తన వీడియోల పై బూతు మాటలు అసభ్యకరమైన పదజాలం వాడుతూ కామెంట్లు చేయటంతో వేధింపులు తట్టుకోలేక టార్చర్ ఎక్కువ అవటంతో అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సోషల్ మీడియా ని టార్గెట్ గా చేసుకుని కొంతమంది సినిమా సెలబ్రిటీల ను టార్గెట్ చేస్తూ వాళ్ళ పైన అసభ్యకరమైన పోస్టింగులు పెడుతూ వీడియో లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి డబ్బులు దండుకుని ఫేక్ అకౌంట్లతో లాభ పడుతున్నట్లు ఇటీవల అనేక వార్తలు బయటపడ్డాయి. వీళ్లంతా ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోవడంతో చాలామంది గురించి వైరల్ న్యూస్ వచ్చిన గాని పెద్దగా పట్టించుకోకపోవడం జరిగింది.

 

అయితే తాజాగా అనసూయ మాత్రం తట్టుకోలేక తన పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో నెటిజన్ల పై ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. మరోపక్క కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు అనసూయ కి మద్దతు ఇస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రి నిద్రపోతోందా ? అంటూ కామెంట్ చేస్తున్నారు. తమ దాకా వస్తే గాని బయటికి రారా..? అనసూయ కి సపోర్ట్ గా ఉండాలని పిలుపునిస్తున్నారు. ఇదే తరుణంలో చాలామంది హీరోయిన్ లు ,హీరో ల భార్యల మీద ఇలాంటి ఫెక్ అక్కౌంట్స్ తో బూతులు తిడుతూ ఉంటారు . .అనసూయ నిలబడినప్పుడు తెలుగు సినిమా ఆమెతో సహకరించకుండా సైలెంట్ గా ఇలాంటి సందర్భంలో ఉండకూడదని మరికొంతమంది ఇండస్ట్రీకి సూచనలు ఇస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version