ఆ వర్గాన్ని బీఆర్ఎస్ దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తోందా..? కేటీఆర్ వ్యూహం అదేనా..?

-

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. గత ఎన్నికల్లో చావు దెబ్బతినింది..ముచ్చటగా మూడోసారి విజయాన్ని అందుకుంటామని భావించిన ఆ పార్టీకి.. ప్రజలు షాకిచ్చారు.. అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. దీంతో.. పోగొట్టుకున్న చోటే.. వెదుక్కునే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ.. దూరమైన వర్గాన్ని దగ్గరకు తీసుకుంటోంది.. ఇందుకోసం కేటీఆర్ తీసుకున్న నిర్ణయమేంటో మీరే చూడండి.

గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓటర్లు కారు పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు.. గిరిజన తండాలు కూడా కారు దిగేసి.. హస్తంకి జై కొట్టాయి.. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది.. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్న బీఆర్ఎస్ కు.. గిరిజనులు దూరమయ్యారనే క్లారిటీకి వచ్చారట.. ఏయే వర్గాలు తమకు దూరం అయ్యాయోనని లెక్కలు చూసుకుంటూ. వాటిని సరి చేసుకునే పని మొదలుపెట్టింది. గిరిజనుల ఓట్లు తమకు పడలేదని గ్రహించిన బీఆర్ఎస్ అధిష్టానం వారిని దగ్గరకుతీసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గిరిజన సామాజికవర్గాల కోసం కొన్ని కార్యక్రమాలు
చేసింది.. తాండాలకు పంచాయితీలుగా గుర్తింపు. వేరే గ్రామ పంచాయతీల్లో భాగంగా ఉన్న తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ప్రత్యేక గిరిజన బోర్డ్ ఏర్పాటు, వాటికి ఛైర్మన్స్ నియామకం లాంటి కారణాలతో లంబాడా, ఆదివాసీలు కారు గుర్తు మీద నొక్కేస్తారని అనుకున్నారట. కానీ వారు అనుకున్నది ఎన్నికల్లో జరగలేదు..

తెలంగాణలో మొత్తం 12 ఎస్టీ రిజర్వ్ సెగ్మెంట్స్ ఉంటే…వాటిలో కేవలం మూడు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది.. దీంతో ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఎదురుచూస్తున్న ఆ పార్టీకి లగచర్ల ఘటన అస్త్రంగా మారిందట.. లగచర్ల ఎపిసోడ్లో గిరిజనులు మీదనే కేసులు పెట్టారని, వాటిని వెంటనే ఎత్తి వేయాలంటూ ఆందోళన మొదలుపెట్టింది బీఆర్ఎస్. నమ్మకం కలిగించేందుకే గిరిజనుల్ని, వారి నాయకుల్ని ఢిల్లీదాకా తీసుకెళ్లింది.. గిరిజనులకు అండగా ఉంటామని భరోసా కల్గిస్తోంది.. ఇదే క్రమంలో ఎస్టీ నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.. ఆ పార్టీ వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version