కడపలో టీడీపీకి కొత్త ఊపు..వైసీపీకి డ్యామేజ్?

-

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు జిల్లాలో మొత్తం వైసీపీ హవానే ఉంది..కానీ ఊహించని విధంగా కొన్ని సీట్లలో ఇక్కడ టీడీపీ పికప్ అవుతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు మూడు, నాలుగు సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుంది..అటు టీడీపీ కూడా పికప్ అవుతుంది. ఈ పరిణామాల బట్టి చూసుకుంటే..వచ్చే ఎన్నికల్లో కడపలో టీడీపీ కనీసం రెండు సీట్లు అయిన గెలుచుకునేలా ఉంది.

అంటే కడపలో టీడీపీ రెండు సీట్లు గెలుచుకున్న గొప్పే అని చెప్పాలి. అయితే ఆ పరిస్తితిని వైసీపీ కల్పిస్తుందని చెప్పాలి. పైగా ఇక్కడ కొందరు సీనియర్ నేతలు టీడీపీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈయన త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి సైతం టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.

ఈ ఇద్దరు నేతలు టీడీపీలోకి వస్తే ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా మైదుకూరు, కమలాపురం స్థానాల్లో టీడీపీకి ప్లస్ అవుతుంది. ఇప్పటికే మైదుకూరులో టీడీపీదే పైచేయిగా ఉంది. కాకపోతే అక్కడ టీడీపీ నేత పుత్తా సుధాకర్ యాదవ్ ఉన్నారు..ఆయనని కాదని డీఎల్‌కు సీటు ఇవ్వడం అనేది కష్టమే. అలాగే కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు..కానీ వీర శివారెడ్డి సైతం సీటు ఆశిస్తున్నారు.

శివారెడ్డికి సీటు దక్కడం డౌటే…అయితే డీఎల్‌ని కడప ఎంపీ సీటులో నిలబెడతారని తెలుస్తోంది. ఇక పుత్తాకి సర్ది చెప్పి శివారెడ్డికి కమలాపురం సీటు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికైతే కడపలో వైసీపీకి రిస్క్ పెరుగుతుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version