వినాయక చవితి స్పెషల్ : ఖిలాడీ నుంచి లిరికల్ వీడియో సాంగ్

మాస్‌ మహారాజ్‌ రవితేజ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ “ఖిలాడీ”. రమేష్‌ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాను ఎ స్టూడియోస్‌ ఎల్‌ఎల్పి పతాకం పై సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు. ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరి పోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ లిరికల్ వీడియో ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా “ఇష్టం” సాంగ్‌ లిరికల్ వీడియో ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటలో హీరో మరియు హీరోయిన్ చాలా న్యాచురల్ గా కనిపించారు. పచ్చని ప్రకృతి మధ్య ఈ సాంగ్ తీశారు. కాగా.. ఈ సినిమా విడుదల డేట్‌ పై ఎలాంటి క్లారిటీ రాలేదు.