ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ పారిశ్రామిక పార్కులు.. కేంద్రం వైఖరి ఇదే : కేటీఆర్

-

ఎక్కడ ఎన్నికలు ఉంటే, అక్కడ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామనే హామీలను ఇచ్చుకుంటూ కేంద్రం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలాంటి అనుకూల పరిస్థితులు లేని ప్రాంతాల్లో డిఫెన్స్‌ కారిడార్లను, బల్క్‌ డ్రగ్‌ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా దేశ అభివృద్ధిని కేంద్ర సర్కారు పణంగా పెడుతోందని మండిపడ్డారు. పారిశ్రామిక ప్రయోజనాలు, అభివృద్ధి లక్ష్యంగా కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీకి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకున్నా, బల్క్‌డ్రగ్‌ పార్కును మంజూరు చేయకపోయినా, ఐటీఐఆర్‌ను రద్దు చేసినా, ఆయా రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో బయో ఆసియా కార్యక్రమంపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version