మరో తెలంగాణా ఉద్యమంలా రైతుల ధర్నా – మంత్రి జగదీష్ రెడ్డి

-

మరో తెలంగాణా ఉద్యమంలా రైతుల ధర్నా చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యపేట నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రాలలో యాసంగి వరిదాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సాంప్రదాయ పంటలను వదిలేసి ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు చెప్పినందుకు రైతులు వరి పంటకు అలవాటు పడ్డారని.. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటుందని పేర్కొన్నారు.

కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 100 శాతం న్యాయం చేయలేవని.. పంజాబ్ లో 100 శాతం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతుందని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. కేంద్రం ఎటువంటి సహాయం చేయకున్నా రైతులకు సమృద్ధిగా నీరు అందించామని.. దేశంలోనే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు సాదించిన రాష్ట్రంగా తెలంగాణాను మొదటి స్థానంలో నిలిపామన్నారు.

తెలంగాణాను ఆదర్శంగా చూపాల్సిన కేంద్రం తెలంగాణా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని.. కోతల దశలో ఉన్న సమయంలో మెడ మీద కత్తి పెట్టి బాయిల్డ్ రైస్ ఇవ్వమని సంతకాలు పెట్టించుకున్నారని ఆగ్రహించారు. వరి వెయ్యొద్దని చెప్పినా ప్రతిపక్ష బీజేపీ నాయకుల రైతులను మోసం చేసేలా వరి వేయమని ప్రోత్సహించి మోసం చేశారని.. కేంద్ర దుర్మార్గ వైఖరిని , బీజేపీ దుష్ట రాజకీయాన్ని ఎండగట్టేందుకే నిరసన ధర్నా చేస్తున్నామని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version