ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఉన్న అమరావతిని కొనసాగించాలి అంటూ ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఉన్న కక్ష సాధింపులను తమ మీద రుద్దవద్దని రైతులు విజ్ఞప్తి చేస్తూ తమ పోరాటాన్ని దశల వారీగా ముందుకి తీసుకువెళ్తున్నారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
మంగళవారం రైతులు అందరూ కూడా జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు దాదాపు నాలుగు గంటల పాటు చిన కాకాని వద్ద రహదారిని దిగ్బంధించారు. ఇక బుదవార౦ కూడా వారి ఆందోళనలు కొనసాగాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భావించిన రైతులు,
బస్సు యాత్రకు సిద్దమైనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి 13 జిలాల్లో బస్సుయాత్ర చేపట్టనున్నారు రైతులు. హైకోర్టు వద్ద నుంచి యాత్ర ప్రారంభించిన రైతులు, అమరావతిలోనే రాజధాని ఈ క్రమంలో 13 జిల్లాల్లో బస్సుయాత్ర చేపట్టాలనే సంచలన నిర్ణయాన్ని జేఏసీ తీసుకుంది. ఈ బస్సుయాత్రలో భాగంగా విశాఖపట్నం, కర్నూలు జిల్లాలో కూడా రైతులు పర్యటించనున్నారు