ఏపీ ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. కాసేపటి క్రితమే… జగనన్న చేదోడు రెండో ఏడాది నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు మొత్తం రూ. 285.35 కోట్లు విడుదల చేశారు సీఎం వైయస్ జగన్. ఇక ఈ పథకం ద్వారా.. 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ సోదరులకు లబ్ది చేకూరనుంది.
ఈ 2.85 లక్షల మంది ఖాతాల్లో.. ఒక్కక్కరి అకౌంట్లలో రూ.10వేలు చొప్పున జగన్ సర్కార్ జమ చేసింది.జగనన్న చేదోడుకు సంబంధించిన డబ్బులు.. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా లబ్ధిదారుల ఖాతాలను అన్ ఎన్ కంబర్ చేయించి మరీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. వెనుకబడిన తరగతుల సంక్షేమం అన్ని ముఖ్య లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది సర్కార్. ఇక జగనన్న చేదోడులో భాగంగా షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ. 146.10 కోట్లు లబ్ది చేకూరనుంది.. షాపులున్న 98,439 మంది రజకులకు రూ. 98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 40.81 కోట్లు లబ్ది చేకూరనుంది.