ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న జిల్లా కర్నూలు. ఈ జిల్లాలో ప్రతీ రోజు కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే అక్కడ 40 కేసులు బయట పడటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు ఆ జిల్లాలో. దీనితో సిఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇప్పటికే కర్నూలు కి సంబంధించిన క్షేత్ర స్థాయి రిపోర్ట్ ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దీనితో జగన్ సర్కార్… ఇప్పుడు కర్నూలు జిల్లాను పూర్తిగా కర్ఫ్యూ పరిధిలోకి తీసుకుని వచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కర్నూలు జిల్లాలో భారీగా కేసులు ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఛాన్స్ తీసుకోవద్దని, అధికారులు అక్కడ పని చేసే వాళ్ళు అక్కడే ఉండాలి గాని బయటకు రావొద్దని, రాజకీయ నాయకులు కూడా అక్కడే ఉండాలని జగన్ ఆదేశించారు.
మంత్రులు ముగ్గురు పూర్తిగా అక్కడే ఉండాలని కూడా జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఏ మంత్రి కూడా అనవసరంగా బయటకు రావొద్దని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని కర్నూలు జిల్లాలనే మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. కర్నూలు లో కరోనా కేసులు 300 దాటాయి. ఇకాదికారుల తప్పులను కూడా క్షమించే అవకాశం లేదని జగన్ చెప్పినటు సమాచారం.