సోనియాగాంధీ పై ఈడీ కేసులకు నిరసనగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కాంగ్రెస్ పార్టీని దూరం చేయడమే బిజెపి ప్లాన్ అని అన్నారు.గుజరాత్ లో అమిత్ షా, మోడీ మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయనీ అన్నారు. రాజకీయ, మత హత్యలు చేసిన వాళ్ళు మోడీ, అమిత్ షా అంటూ మండిపడ్డారు.రాజకీయ హత్యలు చేసిన ఘనత బిజెపిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని శాఖలను అదుపులో పెట్టుకొని కాంగ్రేస్ పై బిజెపి కుట్ర పన్నిందని అన్నారు.
ప్రజల మధ్యకు వెళ్లకుండా… ఈడీ ఆఫీస్ ల చుట్టూ తిప్పాలని బిజెపి ప్లాన్ చేసిందన్నారు.చిన్న చిన్న కారణాలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీనిరాజకీయంగా ఎదుర్కోలేక ఇలా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.ధర్నా చేస్తే రాహుల్ గాంధీ, మా ఎంపిలను అరెస్ట్ చేశారనీ..నేషనల్ హెరాల్డ్ పత్రికతో బీజేపీకి ఎం సంబంధమని అన్నారు.స్వాతంత్రం కోసం ఆ పత్రిక పని చేసిందని..బ్రిటిష్ వాళ్ళు ఎం చేస్తున్నారు అని యావత్తు దేశానికి ఆ పత్రిక తెలియజేసిందన్నారు.
పత్రికలో కామ, పుల్ స్టాప్ లు లేకున్నా తప్పని ఈడీ చూపిస్తుందన్నారు.75 సంవత్సరాల తర్వాత ఈడి కేసు నమోదు చేయడం హాస్యాస్పదమన్నారు.గంటల తరబడి మా అధినేత్రి సోనియాగాంధీ ని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.సామాన్య పౌరులుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ జీవితం గడుపుతున్నారని,గాంధీ కుటుంబానికి..కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.