భయంతో బాలాకోట్ లో తలదాచుకున్న ఉగ్రవాదులు.. ఎయిర్ ఫోర్స్ దాడిలో హతం..!

-

పాక్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు చేసిన ఉగ్ర దాడిలో దాదాపు 400 మంది ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. అయితే.. బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం వెనుక పెద్ద కథే ఉంది. పుల్వామా దాడి తర్వాత భారత్ ఎలాగూ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత్ దాడులు చేస్తుందని భావించిన ఉగ్రవాదులు.. అక్కడ ఉన్న శిక్షణా శిబిరాల నుంచి బాలాకోట్ కు చేరుకున్నారు. బాలాకోట్ అయితే.. సురక్షిత ప్రాంతం అని భావించారు. వందల మంది ఉగ్రవాదులు అక్కడ తలదాచుకున్నారు.

బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు దట్టమైన అడవిలో ఉంటాయి. అక్కడికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లడం అసాధ్యం. అక్కడ ఉన్న కొండల మీద ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటారు. అడవి కదా అక్కడ వసతులేమీ ఉండవు కాబోలు అనుకునేరు. అదో భూతల స్వర్గం. అక్కడ అన్ని వసతులు ఉంటాయి. పాక్ మాజీ సైనికులు.. ఉగ్రవాదులకు అక్కడే శిక్షణ ఇస్తారు.

పుల్వామా దాడి తర్వాత జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాదులను బాలాకోట్ కు తరలించిందన్న సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా భారత్ కు తెలిసింది. దీంతో భారత్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. వాళ్లు గాఢ నిద్రలో ఉండగా.. 25 నిమిషాల్లో బాలాకోట్ లో విధ్వంసం సృష్టించింది. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ట్రెయినర్లు కూడా ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version