ఇప్పుడు జనాల్లో సినిమాల కంటే సీరియల్స్ పైనే ఎక్కువ ఆసక్తిగా ఉంటున్నారు. ఇది సినిమా పరిశ్రమ కంటే పెద్ద పరిశ్రమ గా మారింది. ఇప్పుడు ప్రజలు సినిమాలలో నటించిన వారిని గుర్తు పట్టడం లేదు.అదే జబర్థస్త్ కాని , సీరియల్ లో నటిస్తే చాలు ఇట్టే గుర్తుపడుతున్నారు. ఇక టీవి లలో అన్ని ప్రోగ్రామ్స్ లో వీరి హంగామా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీరిలో నటించే వారుకూడా పరస్పరం ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు.
జానకి కలగనలేదు సీరియల్‌తో ఫేమస్ అయిన అమర్ దీప్ చౌదరి అలాగే ఇక కేరాఫ్ అనసూయ సీరియల్‌తో పేరుతెచ్చుకున్న తేజస్వీని గౌడ ఇద్దరూ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే ఆగస్ట్ నెలలో ఈ ఇద్దరికీ బెంగళూరులో ఘనంగా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అమర్ దీప్, తేజస్వినీలు ఫోటోస్ సోషల్ మీడియాలో అప్పట్లో హల్చల్ చేశాయి.
ఇక తాజాగా ఈ జంటకు వివాహాం జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర తారలు హాజరయ్యారు. అమర్ దీప్ పెళ్లిలో జానకి కలగనలేదు టీం అంతా కూడా తెగ హడావుడి చేశారు.అమర్ దీప్ పెళ్లిలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సీరియల్ నటీమణులు సందడి చేశారు. ఆర్జే కాజల్, అరియానా వంటివారు అమర్ దీప్‌ను ఆడుకున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.