టీఆర్ఎస్ ను వీడ‌నున్న కీల‌క నేత‌.. రేవంత్ రెడ్డి ఎఫెక్టేనా..?

-

ఒక‌ప్పుడు ప్ర‌తి పార్టీ నుంచి టీఆర్ఎస్‌కు వ‌ల‌స‌లు పెరిగేవి. కానీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక టీఆర్ఎస్ నుంచి ఇత‌ర పార్టీల్లోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఇప్పుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ కావ‌డంతో కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన వారంతా మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇదే క్ర‌మంలో రేవంత్ కూడా త‌న‌కున్న స‌ర్కిల్‌లో కీల‌క నేత‌ల‌ను మ‌ళ్లీ కాంగ్రెస్‌కు ర‌ప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇక కేసీఆర్ పార్టీలోకి తీసుకుని ఆ త‌ర్వాత ప‌ద‌వి ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్ట‌డం చాలామంది పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పుడు కూడా హుజూర్‌న‌గ‌ర్‌లో కీల‌కంగా ప‌నిచేస్తున్న జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌కు సిప్ట్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈయ‌న వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ముఖ్య అనుచ‌రుడిగా అప్ప‌ట్లో చ‌క్రం తిప్పారు. పోయిన‌సారి కాంగ్రెస్ పార్టీ నుంచి హుజూర్‌న‌గ‌ర్ బీఫామ్ ఆశించి రాక‌పోవ‌డంతో టీఆర్ ఎస్ కండువా క‌ప్పుకున్నారుఉ. సైదిరెడ్డిని కూడా ఈయ‌నే ద‌గ్గ‌రుండి గెలిపించారు. ఇలాంటి కీల‌క వ్య‌క్తి ఇప్పుడు రేవంత్ రాక‌తో మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version