హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ కి చెందిన కోల్‌కతా లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే… దీనిలో మొత్తం 24 డిప్యూటీ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు వున్నాయి. ఎవరు అర్హులు అన్నది చూస్తే.. అభ్యర్ధుల వయసు 28 నుంచి 47 యేళ్ల మధ్యనే ఉండాలి.

అలానే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. జియోలజీ, సర్వే, ఆర్‌ అండ్‌ డీ, ఎం అండ్‌ సీ, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, లా మొదలైన విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఫిబ్రవరి 28, 2023వ తేదీ లోపు ఆన్‌లైన్ విధానం లో అప్లై చెయ్యాల్సి వుంది.

అప్లికేషన్‌ ఫీజు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500లు అప్లికేషన్‌ ఫీజు గా చెల్లించాల్సి వుంది. ఎస్సీ/ఎస్టీ/ఇతర అభ్యర్ధులు కి ఎలాంటి ఫీజు లేదు. ప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక శాలరీ విషయానికి వస్తే.. రూ.40,000ల నుంచి రూ.1.6 లక్షల వరకు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలని https://www.hindustancopper.com/Page/Career_new లో చూసి మీరు అప్లై చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version