‘అల’ జోడి ‘పుష్ప’ లో రిపీట్..?

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా… క్యాలిక్యులేటర్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగానే సుకుమార్ అంటే ఎన్నో కాలిక్యులేషన్స్ ఉంటాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా విషయంలో సుకుమార్ కాలిక్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సినిమాలో అల్లు అర్జున్ గెటప్ కూడా అభిమానుల అంచనాలను పెంచుతుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ను ఢీకొట్టే విలన్ ఎవరు నటించబోతున్నారు అన్నది అభిమానులందరికీ ఆసక్తి గా మారిపోయిన క్రమంలోనే సోషల్ మీడియాలో రోజుకు ఒకరి పేరు తెరమీదికి వస్తూ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుంచి మాధవన్ విజయ్ సేతుపతి పేర్లు వైరల్ అవ్వగా.. ఇక ఇప్పుడు సముద్రఖని పేరు వైరల్ అవుతుంది. ఇటీవలే అలా వైకుంఠపురం సినిమాలో డిఫరెంట్ మేనరిజంతో విలన్ గా నటించిన సముద్రకని పుష్ప సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news