జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారం జరిగిన తర్వాత మూడు రోజుల పాటు బాధితురాలి ఫ్యామిలీపై నిందితులు ఫోకస్ సెట్టారు. పోలీస్ ఫిర్యాదు ఇస్తే పారిపోయేందుకు నిందితులు ప్లాన్ వేసుకున్నారు. మే 31 వరకు నిందితులు బాధితురాలి ఇంటిపై నిఘా పెట్టారు. మే 31న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో నిందితుల్లో ముగ్గురు సిటీ వదిలి పారిపోయారు. బంజారా హిల్స్ లో నివాసం ఉండే ఒక నిందితుడు తమ కుటుంబంతో కలిసి తమిళనాడు కు పరార్ అయ్యాడు మరో నిందితుడు గోవాకు పరారీ.. ఇంకొక నిందితుడు కుటుంబసభ్యులతో కలిసి ఏపీకి పరారయ్యాడు.