జూపల్లి వర్సెస్ బీరం: కొల్లాపూర్ లో కారుకు డ్యామేజ్?  

-

టీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు రోజురోజుకూ తీవ్రమవుతుంది…ఎక్కడకక్కడ నేతల మధ్య రగడ నడుస్తూనే ఉంది…అయితే కొన్ని చోట్ల సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేసుకునే పరిస్తితి కనిపిస్తోంది..ఏదో ఆధిపత్య పోరు ఉంటే పరోక్షంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తారు..కానీ కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలే ప్రత్యర్ధులుగా మరి ప్రతిపక్ష నేతల మాదిరిగా విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో రగడ ఎక్కువ ఉంది.

ఇప్పటికే తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా కారు నేతల మధ్య వార్ తీవ్రంగా జరుగుతుంది. గత ఎన్నికల్లో కొల్లాపూర్ లో టీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి బరిలో దిగారు…విజయం బీరంని వరించింది. కాంగ్రెస్ నుంచి గెలిచాక బీరం…టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. ఇక అక్కడ నుంచి జూపల్లి, బీరం వర్గాలకు పడటం లేదు.

 

ఆఖరికి కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలో కూడా జూపల్లి..తన వర్గాన్ని సెపరేట్ గా బరిలో దింపి సత్తా చాటారు…మళ్ళీ టీఆర్ఎస్ అధిష్టానం సర్ది చెప్పడంతో..పార్టీకి సహకరించారు. అయినా సరే బీరం..జూపల్లికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు…ఆయన వర్గంపై కేసులు కూడా పెట్టిస్తున్నారు..ఈ క్రమంలోనే తాజాగా జూపల్లి..బీరంపై ఫైర్ అయ్యారు…ఏమైనా సమస్యలపై ప్రశ్నిస్తుంటే…అక్రమంగా కేసులు పెట్టిస్తావా? అంటూ జూపల్లి ఫైర్ అయ్యారు. అలాగే కొల్లాపూర్ కు ఎవరు ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

అటు జూపల్లి మాటలపై బీరం వర్గం ఫైర్ అవుతుంది..ఇలా రెండు వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది…ఒకవేళ ఎన్నికల్లో ఒకరికి సీటు ఇస్తే…మరొకరు సహకరించే పరిస్తితి కనిపించడం లేదు…పైగా వ్యతిరేకంగా పనిచేసేలా ఉన్నారు..ఫలితంగా కొల్లాపూర్ లో కారుకు డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version