తెలుగు సత్తా ఏంటో గుజరాతీలకు చూపిద్దాం : కేఏ పాల్‌

-

మన విశాఖపట్నం మత్స్యకారుల బోట్లు కాలిపోతే, నగరం అంతా కాలిపోతుంటే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించరా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. విశాఖపట్నం నగరానికి చెందిన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏం చేస్తున్నారని నిలదీశారు. ‘మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. స్పెషల్ ప్యాకేజీ ఇవ్వలేదు. పోలవరం కట్టలేదు. స్టీల్ ప్లాంట్ దోచుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో అప్పులతో ఉన్న మా రాష్ట్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని, అహ్మదాబాద్ (గుజరాత్‌)లో స్టేడియం కడతారు. గుజరాత్‌ను అభివృద్ధి చేసుకుంటారు. మాకు నరకం చూపిస్తారు’ అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఒరేయ్ మూర్ఖులారా… నిన్ను ఒకటే అడుగుతున్నాను జీవీఎల్… నీకు, నీ ప్రధానమంత్రికి సిగ్గుందా! మీ గుజరాతీలు అదానీలు వచ్చి మా పోర్టును దోచుకుంటారు, రూ.8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ ను దోచుకుంటారు. ఈ పదేళ్లలో అప్పులపాలైన మా రాష్ట్రం నుంచి లక్షల కోట్లు దోచుకుని గుజరాత్ లో స్టేడియంలు కడతారు… గుజరాత్ ను అభివృద్ధి చేసుకుంటారు… మాకు నరకం చూపిస్తారు. మాకు ప్రత్యేకహోదా ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, స్టీల్ ప్లాంట్ దోచుకుంటున్నారు. లక్షలాది నిరుద్యోగులు నాశనమై పోతుంటే… మా రాష్ట్రంలో తిరగడానికి మీకు, మీ బీజేపీ వాళ్లకు సిగ్గులేదా? ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుక్కుంటున్నారు? ఒరేయ్… కనీసం ఒక్కసారైనా మన తెలుగు సత్తా ఈ మోదీకి, ఈ బీజేపీకి, ఈ జీవీఎల్ కు చూపిద్దాం. ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడిద్దాం. మన తెలుగువాళ్లంటే ఏంటో గుజరాతీలకు చూపిద్దాం” అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version