హైకోర్ట్ కి కేయే పాల్, విశాఖ ఉక్కు అమ్మనిచ్చేది లేదంటూ సవాల్

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలను ఎలాంటి పరిస్థితిలో కూడా వాయిదా వేసేదే లేదని ఏపీ సిఎం వైఎస్ జగన్ స్పష్టం చేసారు. నేడు కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో విపక్షాలు పోరాటం మాత్రం ఆపడం లేదు. ఏపీ లో టెన్త్,ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని హైర్టులో కేయే పాల్ పిటీషన్ దాఖలు చేసారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్ లో హైకోర్ట్ ని విజ్ఞప్తి చేసారు.

ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కూడా ఆయన హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే ప్రసక్తే లేదని అన్నారు ఆయన. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.