వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన నిర్ణయం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ వివేకా హత్యకు వైసీపీ నేతలే కారణమని చంద్రబాబు, పవన్ కల్యాణ్,ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, సునీత, తదితర ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

మరీ ముఖ్యంగా వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు వివేకా హత్యకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డినేనని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో వివేకా మర్డర్ కేసుపై ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్థావన తీసుకురావడానికి వ్యతిరేకంగా వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు.వైఎస్ వివేకా హత్య విషయంపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలకు ఆదేశాలు ఇవ్వాలని సురేష్ బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కడప కోర్టు వైఎస్ వివేకా హత్యపై ఇకపై ఎవరూ మాట్లాడకూదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య ప్రస్థావన తీసుకురావొద్దని వైఎస్ సునీత, షర్మిల, చంద్రబాబు, పవన్ కల్యాణ్,నారా లోకేష్, పురందేశ్వరిలను న్యాయస్థానం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version