“అన్ స్టాపబుల్” షో కు గెస్ట్ గా కాజల్ అగర్వాల్ …!

-

ఆహా ఓటిటి ఛానెల్ లో బాలయ్య వ్యాఖ్యాతగా చేసిన రియాలిటీ షో “అన్ స్టాపబుల్”. ఈ షో కు బాలయ్య డైలాగులతో ఎంతో పేరును తెచ్చుకుంది అని చెప్పాలి. ఇప్పటి వరకు రెండు సీజన్ ల పాటు కొనసాగిన ఈ షో ఆ తర్వాత కొంతకాలం పాటు బ్రేక్ ఇచ్చింది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఈ షో మూడవ సీజన్ కు రెడీ అవుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ మూడవ సీజన్ లిమిటెడ్ ఎడిషన్ అన్న పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలుపుతున్నారు. ఇక ఈ అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ సీజన్ 3 కి గెస్ట్ గా ఎవరు రానున్నారు అని ఆహా సంస్థ “ఎవరో చెప్పుకోండి చూద్దాం ?” అంటూ పోస్ట్ చేసి కమింగ్ సూన్ అని కాప్షన్ ఇవ్వడంతో… ఈ పోస్ట్ లో ఉన్న ఫోటోను బాగా పరిశీలిస్తే కాజల్ అగర్వాల్ గెస్ట్ గా రానుంది అని స్పష్టంగా తెలుస్తోంది.

ఎందుకంటే బాలయ్య తన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి లో కాజల్ అగర్వాల్ తోనే కలిసి నటించడంతో ఈ షో కు ఆమెను పిలుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇందులో ఎంత నిజం ఉందొ తెలియకపోయినా ఫ్యాన్స్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version