బాలయ్య షో లో కమలహాసన్..?

-

తెలుగులో ప్రముఖ ఓటీటీ ఆహా కి రోజు రోజుకి ఆదరణ పెరిగిపోతోంది. అందుకు ప్రధాన కారణం ఏమిటి అంటే తెలుగు ప్రేక్షకులు తడుముకోకుండా అన్ స్టాపబుల్ అని చెబుతారు. బాలయ్య హోస్టుగా కొనసాగుతున్న అన్ స్టాపబుల్ అత్యధిక ప్రేక్షకఆదరణతో దూసుకుపోతోందని చెప్పవచ్చు. సీజన్ 1 కంటే సీజన్ 2 కాస్త క్రేజ్ తగ్గిందని చెప్పాలి. అయితే డార్లింగ్ ప్రభాస్ ఎపిసోడ్ తో ఈ టాక్ మొత్తం రివర్స్ అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి ఆహా యాప్ కూడా పనిచేయడం మానేసింది . ఇక్కడికే ఇంత గలాటా జరిగితే ఇంకా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పై ఎటువంటి క్లారిటీ రాలేదు.

పవన్ కళ్యాణ్ షూట్ జరిగిన రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వైరల్ అయిందో మనం చూసాం. ఆ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు? ప్రోమో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే విషయాలు ఏవి ఇంకా బయటకు చెప్పలేదు. లేకపోతే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మాత్రం కచ్చితంగా సీజన్ 2 కి లాస్ట్ ఎపిసోడ్ అని వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరోపక్క ప్రభాస్ బాహుబలి 2 ఎపిసోడ్ ను జనవరి 6వ తేదీన ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే 13వ తేదీన అన్ స్టాపబుల్ వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ కూడా ఉంటుందని తెలిపారు.

ఇప్పుడు తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కంటే ముందే మరో సూపర్ స్టార్ ఎపిసోడ్ ఉంటుందని వార్త ఒకటి వినిపిస్తోంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల మధ్య మరో స్టార్ హీరో ఎపిసోడ్ రాబోతోంది. ఆయన ఎవరో కాదు విశ్వ నటుడు కమలహాసన్ రాబోతున్నాడని సమాచారం. బహుముఖ నటుడు, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తెలుగులో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోని ఆహా వ్యవస్థాపకులు షోకి రానున్నట్లు కమలహాసన్ ఎపిసోడ్ షూట్ జూన్ 6వ తేదీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా కమల్ అభిమానులకు కూడా ఇది గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version