కమలాసన్ 360 డిగ్రీ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నటించే సత్తా ఉన్న నటుడు: డైరెక్టర్ శంకర్

-

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2.ఈ మూవీని ఈ ఏడాది జూన్12, 2024న లో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో శనివారం నాడు చెన్నైలో ఇండియన్ 2 ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డైరక్టర్ శంకర్ మాట్లాడుతూ.. మొదటి రోజు షూటింగ్‌లో ఇండియన్ 2 గెటప్‌లో కమల్ హాసన్ చూసి అంతా షాక్ అయ్యాము.28 సంవత్సరాల క్రితం ఎలా అనిపించిందో.. ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగిందని తెలిపారు. ఇండియన్ తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఇలాంటి పాత్రను చేయడం మామూలు విషయం కాదని డైరెక్టర్ శంకర్ అన్నారు.ఇక కమలాసన్ 360 డిగ్రీ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నటించే సత్తా ఉన్న నటుడని, 70 రోజుల పాటు మేకప్‌ తో ఆయన నటించారని తెలిపారు. ఆయనలాంటి యాక్టర్ ఈ ప్రపంచంలోనే లేరని ప్రశంసల వర్షం కురిపించారు .ఆయనతో ఇండియన్ 2, ఇండియన్ 3 చేయడం చాలా ఆనందంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news