తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి అయినట్టే అయి ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోతుంది. కరోనా వైరస్… వేడి ఉంటే రాదని చెప్పినా సరే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటుంది. కరీంనగర్ లో కరోనా వైరస్ తీవ్రంగా ఉందని అంటున్నారు. దీనితో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రతీ ఇంటికి వెళ్లి పరిక్షలు నిర్వహిస్తామని అధికారులు అంటున్నారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు వెళ్ళవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఇక భారీగా పోలీసు బలగాలు కరీంనగర్ లో మొహరించాయి. విదేశీయులు ఉన్న ప్రాంతాల్లో పక్కా చర్యలను తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని దుకాణాలు అధికారులు మూసివేయించారు. అటు ప్రజలు కూడా బయటకు రావడం లేదు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం భావిస్తుంది. గుంపులు గుంపులు గా ఉంటే మాత్రం అవసరమైతే జైలుకి అయినా తరలించడానికి సిద్దమయ్యారు. కొంత మంది ప్రభుత్వం హెచ్చరిస్తున్నా సరే చాదస్తం తో బయటకు వస్తున్నారు. అవసరం ఉంటే మినహా బయటకు రావొద్దని ప్రభుత్వం చెప్తున్నా సరే వినడం లేదు కొందరు. కాసేపట్లో తెలంగాణా ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించనుంది.