జస్టిన్ బీబర్ పాట పాడిన కర్ణాటక రైతు.. వైరల్ వీడియో..!

-

ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ సింగర్ జస్టిన్ బీబర్ అంటే బహుశా తెలియని వారుండరేమో.. చిన్న వయస్సు నుంచే గాయకుడిగా బీబర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బీబర్ పాడిన బేబీ.. అనే పాటకు చాలా మంది సంగీత ప్రియులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు అదే పాటను కర్ణాటకకు చెందిన ఓ రైతు పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో ఆ రైతు పాడిన ఆ పాట వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

కర్ణాటకకు చెందిన ఓ రైతు పొలంలో పని చేస్తూ జస్టిన్ బీబర్ పాట.. బేబీ..ని పాడాడు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి దాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ రైతు పాడిన పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. దాన్ని ఇప్పటికే అనేక వేల మంది వీక్షించారు. 3 నిమిషాల 10 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆ రైతు పాడిన జస్టిన్ బీబర్ పాటకు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే ఆ రైతు పాడిన పాటతోపాటు ఒరిజినల్ సాంగ్‌ను కూడా పాఠకులు వీక్షించవచ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version