`సుల్తాన్‌`తో కార్తి మ‌రో హిట్‌కి రెడీ!

-

గ‌త ఏడాది వ‌రుస‌గా రెండు విజ‌యాల్ని ద‌క్కించుకున్నాడు కార్తి. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కన `ఖైదీ` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఆ త‌రువాత వ‌దిన జ్యోతిక‌తో క‌లిసి తొలిసారి చేసిన `దొంగ‌` కూడా హిట్ అనిపించుకుంది. ఈ రెండు చిత్రాలిచ్చిన ఉత్సాహంతో ఈ ఏడాది కార్తి మ‌రో మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ `సుల్తాన్‌`‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

శివకార్తికేయ‌న్‌తో `రెమో` చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న భాగ్య‌రాజ క‌న్న‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. `ఖైదీ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌. ప్ర‌కాష్‌బాబు, ఎస్‌.ఆర్. ప్ర‌భు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ పూర్త‌యింది. సోమ‌వారం ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని హీరో కార్తి సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

`ప్రియమైన సహోదరసహోదరీలారా, మీ ప్రేమ మరియు ప్రశంసలే మమ్మల్ని కొనసాగిస్తున్నాయి!. `సుల్తాన్` ఫస్ట్ లుక్ ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను! లవ్ యు అబ్బాయిలు!. `సుల్తాన్` ఫస్ట్ లుక్` అని ట్వీట్ చేశాడు. ఫ‌స్ట్ లుక్‌లో ప‌వ‌ర్ వైర్‌ని హంట‌ర్‌గా వాడుతూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో కార్తి ఫెరోషియ‌స్‌గా .. సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్న తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఈ మూవీతో డ్రీమ్ వారియ‌ర్ బ్యాన‌ర్‌లో కార్తికి మ‌రో హిట్ గ్యారెంటీ అనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version