చీటింగ్ కేసు గురించి స్పందించిన కత్తి కార్తీక.. దేనికీ భయపడను !

-

ఒకప్పటి యాంకర్, ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా మారిన కత్తి కార్తీక పై చీటింగ్ కేసు నమోదైందన్న సంగతి తెలిసిదే. ఒక ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తా అంటూ కోటి రూపాయల మోసానికి పాల్పడ్డ కార్తీక , ఆమె అనుచరుల పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అమీన్ పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీ కి ఇప్పించేందుకు మద్య వర్తిత్వం చేసిన కార్తీక బాధితుడి దగ్గర కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకుందని ఆమె మీద ఫిర్యాదు చేశారు.

అయితే ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ నామినేషన్ విత్ డ్రా చేయమని నా మీద ఒత్తిడి లు వస్తున్నాయని అన్నారు. 52 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేస్తే ఎవరు ఊరుకోరని, ల్యాండ్ కి సంబంధించి అన్ని ఎంఓఇలు నా దగ్గర ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కోటి రూపాయలు చెక్కు రూపం లో ఇచ్చారని, ఈ కేసు ను న్యాయ పరం గా ఎదుర్కొంటానని అన్నారు. ల్యాండ్ చూపించడం వరుకు మాత్రమే మా పని అని పేర్కొన్న ఆమె అన్ని చట్ట పరం గానే జరిగాయని అన్నారు. నేను దేనికి భయపడను అని పేర్కొన్న ఆమె అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version