గతంలో తెలుగు సినిమాలలో నటించిన కస్తూరి మళ్లీ మాటీవి లో వచ్చే గృహలక్ష్మీ సీరియల్తో తులసిగా తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఈ సీరియల్ మంచిగా ఉండడంతో ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. గృహలక్ష్మీ సీరియల్ అంటే తల్లి పాత్ర కాబట్టి పద్ధతిగా ఉంటోంది. లేకుంటే తనలోని హాట్ నెస్ ను బయటకి తీసి బెంబేలు ఎత్తించేది.
ఇక అమ్మడు తన నోటి దూల తో తమిళ సినిమా పరిశ్రమ లో స్టార్స్ పై విమర్శలు గుప్పించేసి అగ్గి రాజేసింది. ప్రస్తుతం ఆమె సీరియల్ తో పాటు వెబ్ సిరీస్లు కూడా చేస్తోంది. పరంపర అనే వెబ్ సిరీస్లో కస్తూరీ శంకర్ కాస్త బోల్డ్ కారెక్టర్ కూడా చేసింది. అయితే కస్తూరీ శంకర్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. తన మీద వచ్చే నెగెటివ్, పాజిటివ్ ట్వీట్లకు స్పందిస్తూ వెంటనే రియాక్ట్ అవుతుంది.
తాజాగా తన ఫోన్ మెట్రోలో ప్రయాణిస్తుండగా పోయిందట. అయితే ఇదే విషయాన్ని మెట్రో అధికారులకు కంప్లైంట్ చేసిందట. వెంటనే వారు స్పందించి ఫోన్ను కనిపెట్టడంతో కస్తూరీ మురిసిపోయింది. చెన్నై పట్ల, ఇక్కడి అధికారుల పట్ల మరింత గౌరవం పెరిగిందని కస్తూరీ ట్వీట్ వేసింది. ఇక నెటిజన్స్ ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చింది.మీరు సంపాదించిందంతా? ఏం చేస్తారు అని నెటిజన్ అడిగే సరికి నేను సంపాదించిందంతా కూడా మెడికల్ హెల్ప్, చైల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతా అంది.కస్తూరీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.