ఆ భయంతోనే కేసిఆర్ అసెంబ్లీకి రావట్లేదు: మల్లు రవి

-

అసెంబ్లీలో కీలక చర్చలు జరుగుతుంటే మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు హాజరు కావడం లేదని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ప్రశ్నించారు.సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ….. అసెంబ్లీకి వస్తే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుందనే భయంతోనే కేసీఆర్ సమావేశాలకు రావట్లేదని మల్లు రవి ఎద్దేవా చేశారు. ‘ఆరోగ్యం సహకరించకపోతే కేసీఆర్ నల్గొండకు ఎలా వెళుతున్నారు? కృష్ణా జలాలపై అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రం మొత్తం చూస్తుంది. నల్గొండకు వెళ్లి మాట్లాడటం ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్లో మాట్లాడారు.

కృష్ణ జలాల గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరుకాకపోవడం ప్రజలను అవమనపరిచినట్టే అని అన్నారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ రాకుండా బయట ఎక్కడో మాట్లాడటం సరకాదన్నారు. కృష్ణ జలాలను పెద్ద ఎత్తున ఆంధ్ర తరలింపు చేస్తుంటే కేసీఆర్ మాట్లాడలేక పోవడం సరికాదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version