త్వరలో కేసీఆర్, జగన్ సమావేశం…?

ఏపీ సిఎం వైఎస్ జగన్, తెలంగాణా సిఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి వీరు ఇద్దరి మధ్య కీలక చర్చ జరుగుతుంది. హైదరాబాద్ లో నిల్వ సదుపాయాలకు సంబంధించి జగన్, కేసీఆర్ తో సమావేశం అవుతున్నారు. ఏపీలో సదుపాయాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో తెలంగాణా ప్రభుత్వ సహకారం తీసుకునే అవకాశం ఉంది.

ఈ మేరకు సిఎం జగన్ ఈ నెల మూడో వారంలో ప్రగతి భవన్ కి రానున్నారు. ఈ సమావేశంలో జలవనరుల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఈ భేటీపై ఏపీ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేస్తాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణా సహకారం తీసుకోవాలని సిఎం జగన్ భావిస్తున్నారు.