ఏ సందర్భంలో ఎలా రాజకీయం చెయ్యాలి, ఏ నిమిషంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరిని ఏ విధంగా తన వైపుకి తిప్పుకోవాలి అనే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దిట్ట. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బిజెపిని వ్యతిరేకించకుండా, కాంగ్రెస్ ని సమర్ది౦చకుండా ఆయన చేసిన రాజకీయం గురించి చాలా చర్చలే జరిగాయి. ఫెడరల్ ఫ్రంట్ అనేది రూపు దాల్చకపోయినా సరే కేసీఆర్ మాత్రం బిజెపికి శత్రువు అవలేదు. ఇప్పుడు తాజాగా ఇలాంటి పరిణామమే ఒకటి జరిగింది. బిజెపికి శత్రువు కాకుండా ఆయన రాజకీయం చేసారు.
పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో కేసీఆర్ రాజకీయంగా చాలా మందిని ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో నాలుగు స్థానాలను బిజెపి గెలిచిన తర్వాత కేసీఆర్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడ్డాయి. కాని కేసీఆర్ ఎక్కడా కూడా ఆ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు కనపడలేదు. తాజాగా పార్లమెంట్ లో ఈ బిల్లుకి వ్యతిరేకంగా కేసీఆర్ ఓటు వేసారు. ఈ బిల్లుని ముస్లిం వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర౦లో మజ్లీస్ తో కేసీఆర్ స్నేహం చేస్తున్నారు. ఇప్పుడు తాను అనుకూలంగా ఓటు వేస్తే మజ్లీస్ దూరం కావడంతో పాటు,
రాష్ట్రంలో ముస్లిం వర్గాలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో తనకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. తాను అనుకూలంగా ఓటు వేసినా వేయకపోయినా బిల్లు అనేది పాస్ అవుతుంది. కాబట్టి వ్యతిరేకంగా ఓటు వేసారు. కాంగ్రెస్ నూరు కేసీఆర్ ని విమర్శించకుండా ఆ వ్యూహం ఫలించింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ లో ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలు జరగకుండా కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా హైదరాబాద్ నిరసనలు దేశానికి అంతగా తెలియకుండా శాంతి భద్రతల విషయంలో జాగ్రత్త పడ్డారు. దీనితో బిజెపి నేతలకు ఆయన అస్త్రం ఇవ్వలేదు. రాష్ట్రంలో దాని ప్రభావం లేకుండా అన్ని వర్గాలను ఆయన కట్టడి చేసి హిందువులకు దూరం అవ్వలేదు. ఫైనల్ గా దట్ ఈజ్ కేసీఆర్…!