సత్తుపల్లిలో కీచక బాబాయ్.. కూతురి వరసయ్యే బాలికతో!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటిపక్కనే ఉంటున్న కుటుంబలోని బాలికను అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు సమాచారం.ఈ విషయాన్ని బాలిక ఇంట్లో వారికి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే బాధిత కుటుంబీకులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బుధవారం అర్ధరాత్రి ఆ వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ బాలికతో బాబాయ్ వరుస అయ్యే షేక్ పాషామియా నిన్న సాయంత్రం అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిని మందలించడంతో పాటు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే షేక్ పాషామియాపై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ పోలీసులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version