Keep It Real:బర్గర్లపై కృత్రిమ రంగులని తొలగించిన బర్గర్ కింగ్.. ఇంకా ఏమంటుందంటే?

-

ప్రస్తుత తరంలో ఆకర్షణీయంగా కనబడిందే బాగుందన్న భ్రమలో పడిపోతున్నారు. ఆకర్షణీయంగా లేనిదేదైనా తమ దృష్టిలో అంత మంచిది కాదన్న అభిప్రాయంలో ఉన్నారు. అందువల్లే వ్యాపారస్తులు తమ ఉత్పత్తులని ఆకర్షణీయంగా అమరుస్తున్నారు. అలా ఆకర్షణీయంగా కనిపించడానికి ఆహార సంస్థలు తాము రెడీ చేసే ఆహారాలపై కృత్రిమ రంగులని వాడుతున్నారు. చూడగానే నోరూరించేలా చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ రంగులని వాడుతున్నారు.

ఐతే ఆ రంగులు ఆరోగ్యానికి హాని కలగజేస్తాయి. కృత్రిమమైనదేదైనా ఆరోగ్యానికి చేటు చేసేదే. ఫాస్ట్ ఫుడ్,, పిజ్జా, బర్గర్స్ అందించే సంస్థలు ఇలాంటివి ఉపయోగిస్తుంటాయి. ఐతే తాజాగా బర్గర్ కింగ్ సంస్థ, తన ఫుడ్ మెనూ నుండి కృత్రిమ రంగులని తొలగించింది. ఆహారాన్ని మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి వాడే రంగులని తాము వాడట్లేదని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. కీప్ ఇట్ రియల్ అన్న పేరుతో ఈ వీడియోలో రంగు రంగుల బాటిళ్ళు కనిపిస్తాయి.

ఆ బాటిళ్ళలోని రంగుని బర్గర్ కింగ్ పోస్తర్లు తయారు చేయడానికి వాడతామని, ఆ రంగుల ద్వారా పోస్టర్లు మాత్రమే అందంగా కనిపిస్తాయని, ఆహారాన్ని స్వఛ్ఛంగా ఉంచుతున్నామని, మా మెనూలాగా ఆహారం కూడా అత్యంత స్వఛ్ఛంగా ఉంటుందని వెల్లడి చేసింది. ఈ మేరకు బర్గర్ కింగ్ ట్వీట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వినియోగదారులకు స్వఛ్ఛమైన ఆహారాన్ని అందిస్తున్న బర్గర్ కింగ్ ని మెచ్చుకుంటున్నారు. ఇది మంచి నిర్ణయం అని, ఇలాగే మరొకొన్ని ఫాస్ట్ ఫుడ్ అందించే సంస్థలు, పిజ్జా సెంటర్లు మొదలగునవి కూడా కృత్రిమ రంగులని వాడకుండా ఉంటే బాగుంటుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version