ఎన్నికల్లో గెలిస్తే ఒక్కో మహిళకు రూ.1000… కేజ్రీవాల్ బంపరాఫర్….!

-

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లోనూ అధికారం దక్కించుకునేందుకు పథకాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని మోగా లో జరిగిన ఓ భహిరంగ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ….వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని… ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇస్తామని బంపరాఫర్ ప్రకటించారు.

అంతే కాకుండా పించన్ తీసుకుంటున్న వారికి కూడా అదనంగా ఈ వెయ్యి ఇస్తామని చెప్పారు. మరోవైపు ప్రతి ఇంటికి 300 యూనిట్ ల కరెంట్ కూడా ఫ్రీగా ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉచిత వైద్యం, ఔషధాలను అందిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ప్రధాన ప్రతిపక్షం గా నిలిచింది. దాంతో వచ్చే ఏడాది ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version