చంద్రబాబు పవన్, బీజేపీ ని మోసం చేస్తున్నారు: కేశినేని నాని

-

నారా చంద్రబాబు నాయుడు కి ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీని ఇంప్రెస్ చేయడానికి ఆయన నానా పాట్లు పడ్డారని అన్నారు చంద్రబాబు నాయుడుకి ఒక ముక్క హిందీ రాదు తెలుగులో రాసుకొని హిందీలో చదివాడు అని అన్నారు. ఒకప్పుడు మోడీని టెర్రరిస్ట్ అన్నాడు ఇప్పుడు గొప్పవాడు మంచివాడు అంటున్నారని ఆరోపించారు.

ప్రపంచ దేశాలు మోడీని అసహ్యించుకుంటున్నాయని ఆనాడు అన్నాడు ఇప్పుడు మోడీ ప్రపంచానికి ఆదర్శమని అన్నాడు. ఊసరవెల్లి లాగా రంగులు మార్చి నిన్న ఒకటి ఇవాళ ఒకటి మాట్లాడుతున్నారని నాని అన్నారు. చంద్రబాబు చేసిన స్కాం నుండి బయటపడడానికి మోడీ అమిత్ షా కాళ్లు పట్టుకుని పొత్తు కుదుర్చుకుని వచ్చారని అన్నారు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు మోసం చేస్తున్నాడని బిజెపిని మోసం చేస్తున్నాడని పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version