`ఆర్‌ఆర్ఆర్‌`కు పోటీగా కెజియఫ్2.. క్లారిటీ ఇచ్చిన యష్..!!

-

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా అనంతరం జక్కన్న దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తెరకెక్కుతోంద. దీంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని ఆత్రుత చూస్తున్నారు అందరూ. ఇక కన్నడ సినిమాలు అంటే ఇంతకుముందు చిన్నచూపు ఉండేది.

కానీ కెజియఫ్ విడుదల తర్వాత అది పోయింది. ఈ చిత్రం సృష్టించిన సంచలనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పుణ్యమా అని కన్నడ సినిమా కూడా బాలీవుడ్‌లో జెండా పాతేసింది. ఇక ఇప్పుడు కెజియఫ్ 2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తొలి భాగం సంచలన విజయం సాధించడంతో రెండో పార్ట్‌పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలోనే కెజియ‌ఫ్‌2 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ప్రేక్ష‌కులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇలా అటు ఆర్ఆర్ఆర్ సినిమాకు, ఇటు కెజియఫ్2 ఓ రేంజ్‌లో క్రేజ్ ఏర్ప‌డింది. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానున్నాయి.

ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ టీం ఏడాది 8న విడుదల కానున్నట్లు ప్రకటించింది. మ‌రోవైపు ఎలాంటీ స్పష్టమైన తేదీ ప్రకటించకున్నప్పటికీ దాదాపు అదే తేదీల్లో కెజియఫ్ 2 రిలీజ్ అయ్యే అవకాశం ఉందని, జియఫ్2 ఆర్‌ఆర్‌ఆర్ తో పోటీకి దిగడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై స్పందించి కెజియఫ్ స్టార్ యష్.. ఆర్ ఆర్ ఆర్ కెజియఫ్2 మధ్య క్లాష్ అనేది జరగని పన‌ని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ రెండు చిత్రాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది అనిల్ తడానీ , కాబట్టి రెండు ఒకే సమయంలో విడుదల అవడం జరగదన్నారు. ఏదైతేనేం ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చాడు య‌శ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version