మోదీ వ్యాఖ్యలకు మల్లికార్జున్ ఖర్గే కౌంటర్‌

-

మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారంనాడు రాజ్యసభలో తిప్పికొట్టారు. ఓవైపు మణిపూర్ రగులుతుంటే ప్రధానమంత్రి ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మాట్లడటం ఏమిటని నిలదీశారు. దీనికి ముందు, ఇండియా కూటమి సమావేశంలో మణిపూర్‌ విషయంపై మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి సమావేశమైంది. మణిపూర్ హింసపై పార్లమెంటులో మోదీ ప్రసంగించాలనే డిమాండ్ లక్ష్యంగా ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి కూడా వచ్చింది.

మ‌ణిపూర్ ఘ‌ట‌న‌ల‌పై పార్లమెంట్ వెలుప‌ల మాట్లాడిన మోదీ పార్ల‌మెంట్ లోప‌ల ఈ విష‌యంపై స‌మ‌గ్ర చ‌ర్చ చేప‌ట్టి అక్క‌డి ప‌రిస్ధితిని అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌భుత్వం చేపట్టిన చ‌ర్య‌లు వివ‌రించాల‌ని ఖ‌ర్గే డిమాండ్ చేశారు. మ‌ణిపూర్ వ్య‌వ‌హారాన్ని రాజ‌స్ధాన్‌, చ‌త్తీస్‌ఘ‌ఢ్‌, ప‌శ్చిమ బెంగాల్ వంటి బీజేపేయేత‌ర రాష్ట్రాల్లో జ‌రిగిన ఘ‌ట‌నల‌తో పోల్చ‌లేమ‌ని చెప్పారు. దేశంలో ఈశాన్య రాష్ట్రాల‌న్నింటిలోనూ మ‌ణిపూర్ అల్ల‌ర్లు ఆందోళ‌న రేకెత్తిస్తాయ‌ని అన్నారు. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న వేధింపుల గురించి కాషాయ పాల‌కుల‌కు ప‌ట్ట‌డం లేద‌ని ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version