సాయి గణేష్ ఘటన పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

స్థానిక మంత్రి పోలీసుల పై తీసుకొని వచ్చిన ఒత్తిడి కారణంగా సాయి గణేష్ వాంగ్మూలం రికార్డ్ చేయలేదని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీఆరెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది…ఖమ్మం సంఘటన అందుకు అద్దం పడుతుందన్నారు. తెలంగాణ లో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా పెరిగిపోయింది… కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ప్రతిపక్ష పార్టీలు వార్డు ల్లో ఖర్చు చేయడం లేదని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

అనేక సర్వేలు టీఆరెస్ కు వ్యతిరేకం గా వస్తున్నాయి. రైతు బంధు నుంచి దళిత బంధు టీఆరెస్ నాయకుల కను సన్నల్లో ఉన్నాయన్నారు. కేసీఆర్ ఒక్కడి కారణంగా తెలంగాణ రాలేదు.12 వందల మంది ఆత్మహత్య ల కారణం గా తెలంగాణ వచ్చిందని తెలిపారు.

12 వందల ఆత్మబలిదానం వృధా పోదని..గత రెండు ఎన్నికల్లో మిమ్మల్ని ఎలా గెలిపించారో అలాగే ఒడిస్తారని తెలిపారు.టీఆరెస్ అధికార దుర్వినియోగం పై బీజేపీ పోరాటం చేస్తుందని..టీఆరెస్ అవినీతి అరాచక పాలన పై బీజేపీ పోరాటం చేస్తుంటే తెలంగాణ సెంటిమెంట్ కు లింక్ పెడుతుందని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version