ఇటువంటి సీఎం తెలంగాణ రాష్ట్రానికి అస్సలు వద్దు ?: కిషన్ రెడ్డి

-

తెలంగాణాలో రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అంటే సీట్ల గురించి ఆలోచన, ఎన్నికల వ్యూహాలపై తమ దృష్టిని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రీకరించాయి. ఇక సీఎం కేసీఆర్ అయితే ఎన్నికల గురించి ఆలోచిస్తూ కనీసం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నా రావడం లేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ప్రస్తావిస్తూ కేసీఆర్ పై విమర్శలను సంధించారు. రాష్ట్రము బాగుపడే పనులు బీజేపీ ప్రభుత్వం తెలంగాణాలో చేస్తుంటే కనీసం రాకుండా ఉన్న సీఎం మనకు అవసరమా అంటూ కామెంట్ చేశాడు కిషన్ రెడ్డి. తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డును తీసుకువచ్చాము.. కానీ దీనిని సాకారం చేసుకోవడానికి కనీసం సీఎం కేసీఆర్ భూసేకరణ చేయడానికి ముందుకు రాకపోవడం చాలా బాధాకరం అన్నారు కిషన్ రెడ్డి.

అందుకే మేమిప్పటికే చాలా సార్లు చెప్పాము కేసీఆర్ కు రాజకీయాలపై ఉన్న శ్రద్ద ప్రజల బాగోగులపై ఉంటే బాగుంటుంది అంటూ చురకలు అంటించారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version