BREAKING : వీ6 వివేక్‌ తో కోమటి రెడ్డి భేటీ..బీజేపీలోకి వెళ్లనున్నారా !

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఓ సంచలనం. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉన్పప్పటికీ… ఎప్పుడూ ఏ పార్టీని పొగుడుతారో తెలియదు. అయితే.. తాజాగా వీ6 అధినేత, బీజేపీ నాయకులు వివేక్‌ ను కలిసారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాదాపు గంట పాటు వీరిద్దరూ చర్చలు నిర్వహించారు. అయితే.. ఈ భేటీ అయిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ..వివేక్ కొలీగ్స్ అని..అప్పుడప్పుడు ఇలాగే కలుస్తామన్నారు.

వివేక్ కాంగ్రెస్ లో కొలీగ్ అని.. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని క్లారిటీ ఇచ్చారు. అనంతరం కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు కోమటి రెడ్డి. కెసిఆర్ మాటల మీద నమ్మకం లేదని.. మాటలు చెప్పి మభ్య పెడతారని ఫైర్‌ అయ్యారు. ఏ ఒక్కటి కూడా అమలు అయ్యే మాటలు లేవని.. కెసిఆర్ మాటలు నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరని చురకలు అంటించారు. హుజూరాబాద్ లో వేల కోట్లు పెట్టినా ఈటెల ను గెలిపించారని…వచ్చే ఎన్నికల్లో గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు. వచ్చేవి ప్రజా స్వామ్య రోజులు అని.. బానిస బతుకులు అవసరం లేదని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version