మంచి స్క్రిప్ట్ రాసే డిటెక్టివ్ ను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని పార్లమెంట్ ఎన్నికల వరకు టైం పాస్ చేయాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు తెరమీదకు తెచ్చారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ హామీల నుంచి ప్రజల దృష్టి డైవర్ట్ కావాలని పనికి మాలిన కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒక పరాన్నజీవి అని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పనికి మాలిన మాటలతో ఆరోపణలతో ప్రజలకు ఉపయోగపడేది ఏమి లేదు అని మండిపడ్డారు.
రాష్టం నాలుగున్నర నెలల్లోనే ఆగమైంది. ఎట్లుండే తెలంగాణ ఎట్లయ్యింది అని ధ్వజమెత్తారు. కేసీఆర్ లేని లోటు స్పష్టం కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంపై ప్రజలకు నమ్మకంపోయింది అని అన్నారు.రైతుపక్షాన కేసీఆర్ ప్రశిస్తే.. ‘పేగులు కత్తిరిస్తా.. గుడ్లు పీకి గోలీలాడుతా.. లాగులో తొండలు ఇడుస్తా’ ఇదే నా ముఖ్యమంత్రి మాట్లాడే భాష. లోక్ సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ టైం పాస్ చేయాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు తెరమీదకు తెచ్చారు అని అన్నారు.