బీఆర్‌ఎస్ కార్యకర్త మల్లేశ్ కుటుంబాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం గంట్రావుపల్లిలో మల్లేశ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్లేశ్ ఇంటికి వెళ్ళి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లేశ్ కుటుంబానికి రూ.5లక్షల చెక్కును అందజేసి అన్నివిధాలా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
బీఆర్‌ఎస్ కార్యకర్త మల్లేశ్ హత్యపై డీజీపీ, ఎస్పీ నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు .కేటీఆర్ అనంతరం మాట్లాడుతూ మల్లేశ్ హత్య సంఘటనపై కాల్ డాటా బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.గత పది సంవత్సరాల తమ పాలనలో ఏనాడు భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు పాల్పడలేదని తెలిపారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ,మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్,బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు.