ప్రజలు ఒకసారి మోసపోతే నాయకులు తప్పు అవుతుందని రెండవసారి కూడా మోసపోతే కచ్చితంగా ప్రజలు తప్పే అవుతుందని కేటీఆర్ అన్నారు. ఈరోజు చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా రాజేంద్రనగర్ రోడ్ షో లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు హామీలు తో ప్రజల్ని మోసం చేయడానికి కాంగ్రెస్ మరోసారి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లోను అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది అని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలను గ్రహించి బీసీలు, ఎస్సీలు అలానే ఎస్టీలు ఏకమై గెలిపించాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ అలానే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన హస్తం పార్టీ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ఇంకోసారి మోసం చేయడానికి చూస్తోందని ఆరోపించారు.